జంబలకిడి పంబ ట్రైలర్ విడుదల

640
jambalakidi-pamba-movie-trailer

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరో గా వస్తున్న మరో చిత్రం జంబలకిడి పంబ, ఈ చిత్రం ట్రైలర్ హీరో రవితేజ హైదరాబాద్ లో లాంచ్ చేసాడు. 

టాలీవుడ్ నటుడు శ్రీనివాస్‌రెడ్డి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జంబలకిడి పంబ’. జేబీ మురళీ కృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధి ఇదానీ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా జూన్‌ 22న విడుదల కానుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఇవివి. సత్యనారణ డైరెక్షన్ లో వచ్చిన జంబలకిడి పంబా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. కొత్తగా ప్రయత్నించిన ఈ ప్రయత్నంకు జనాలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడే అదే స్థాయిలో కాకుందా కొంచె అదే ఫార్మేట్ లో మనిషి లింగ బేధాలు మారడం అనే కాన్సెప్ట్ తో మరో జంబలకిడి పంబ వస్తోంది. ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మగవాళ్లు ఆడవాళ్లుగా.. ఆడవాళ్లు మగవాళ్లుగా మారడం ఇవివి చూపించగా.. ఇప్పుడు జేవీ మురళి కృష్ణ ఆ మసాలను తగిలించి భార్య భర్తల్లో ఆ వ్యత్యసాన్ని సున్నితంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.. మంచి స్పందన కూడా వస్తోంది. వెన్నెల కిషోర్ లాంటి మరికొద్ది మంది కమెడియన్ లు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది.


భార్య భర్తలు విడాకులను కోరడం.. తర్వాత లాయ చేసిన ప్రయత్నాలు వారు మగ ఆడవేశాలు ఎందుకు తారుమారయ్యాయి అనే ఫార్ములాతో వస్తుంది. కొన్ని కామెడీ డైలాగ్స్ ట్రైలర్లో బానే ఆకట్టుకున్నాయి మరి సినిమా ఏ రెంజ్లో ఆలరిస్తుందో చూడాలి. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.