శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠమాసం, శుక్లపక్షం; తిథి: చవితి ఉ. 11.39 తదుపరి పంచమి; నక్షత్రం: పుష్యమి ఉ. 6.20 తదుపరి ఆశ్లేష తె. 4.19; వర్జ్యం: సా. 6.03-7.31; దుర్ముహూర్తం: సా. 5.05-5.57; అమృతఘడియలు: రా. 2.52-4.20; రాహుకాలం: సా. 4.30-6.00; సూర్యోదయం: 5.43; సూర్యాస్తమయం: 6.50
మేష రాశి : వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధి స్తారు. విందు, వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. వైద్యం, హోటల్స్, పరిశ్రమల రంగాల వారికి చర్చలు ఫలిస్తాయి.
వృషభ రాశి : చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. బ్యాంకింగ్, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
మిథున రాశి : బదిలీలు, మార్పులకు అనుకూలం. గృహ నిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలి స్తాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. మనసు మార్పును కోరుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరం.
కర్కాటక రాశి : ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరుల విషయంలో శుభ పరిణామాలు సంభవం. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. కమ్యూనికేషన్ రంగం వారు లక్ష్యాలు సాధిస్తారు.
సింహ రాశి : పెట్టుబడులు, స్పెక్యులేషన్లకు అనుకూలం. బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం ఫలిస్తుంది.
కన్య రాశి : వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అసుసరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖుల కలయిక సత్ఫలితాల నిస్తుంది. గౌరవ పదవులు అందుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
తుల రాశి : ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ప్రదర్శనలు, సభల్లో పాల్గొంటారు. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి శుభప్రదం. దాన, ధర్మాలకు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చిక రాశి : మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, బీమా వ్యవహారాలకు అనుకూలం. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు.
ధనుస్సు రాశి : ప్రముఖులను కలుసుకుంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. ఉన్నత పదవులు అందుకుంటారు.
మకర రాశి : రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారు వృత్తిపరంగా లక్ష్యాలు సాధిస్తారు. సమా వేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో విజయం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.
కుంభ రాశి : స్పెక్యులేషన్లు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియ తముల ఆరోగ్యం మెరుగవుతుంది. రుణ ప్రయ త్నాలు ఫలిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీన రాశి : శుభ కార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.