నాగబాబు కూతురు నిహారిక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎలా ఉందో చూద్దామా

2195
niharika happy wedding

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.. అటు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ హీరో నాగ శౌర్య సరసన ‘ఒక మనసు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ విజయవంతం కాలేదు. ‘ఒక మనసు’లో నటించకముందే ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్ ను రూపొందించి యూట్యూబ్ లో మంచి హిట్ కొట్టింది. ‘ఒక మనసు తర్వాత విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చిత్రంలో నటించినప్పటికీ అది కూడా అంతంతమాత్రంగానే ఆడింది. ప్రస్తుతం ఈ సుందరి ‘హ్యాపీ వెడ్డింగ్’ లో నటిస్తోంది.


సుమంత్ అశ్విన్ సరసన ఈ భామ నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం జూన్ 21న విడుదలవుతోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా హ్యాపీ వెడ్డింగ్ పోస్టర్ ను తన ఫేస్ బుక్ లో నిహారిక పోస్టు చేసింది. ఇందులో వెడ్డింగ్ ఇన్విటేషన్ అని రాసి ఉన్న పలకను హీరో సుమంత్ అశ్విన్ పట్టుకోగా, జూన్ 21 అని రాసి ఉన్న పలకను నిహారిక పట్టుకుంది. తద్వారా మా వెడ్డింగ్ చూడటానికి జూన్ 21 రమ్మంటూ ప్రేక్షకులను ఆహ్వానించింది.

niharika-happy-wedding

కాగా హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందించగా, సీతారామ శాస్త్రి, శ్రీమణి పాటలు రాశారు. ఈ సినిమా మంచి విజయం సాధించి మెగా డాటర్ కు మంచిపేరు తెస్తుందేమో చూడాలి.