నేను గర్భవతిని కాదు!

366
ileana-dcruz-not-pregnant-and-here's-proof

ఇలియానా తల్లికాబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై ఆమె బదులివ్వకపోవడంతో ఇలియానా గర్భం దాల్చిన మాట నిజమేనంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పింది ఇలియానా. తాను గర్భవతిని కాదంటూ శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నది. ఓ ఫొటోను పోస్ట్ చేసిన ఇలియానా ఆండ్రూ నీబోన్ తీశారని చెప్పింది. చాలా కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా ప్రేమలో ఉన్నట్లు , ఇటీవలే వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆండ్రూతో ప్రేమాయణం, పెళ్లి వార్తలపై ఇప్పటివరకు పెదవివిప్పలేదు ఇలియానా. వ్యక్తిగత విషయాల్ని పంచుకోవడం తనకు ఇష్టం ఉండదంటూ బదులిస్తూ వచ్చింది ఈ గోవా సుందరి.

#notpregnant 🙏🏼 📷@andrewkneebonephotography ♥

A post shared by Ileana D’Cruz (@ileana_official) on