టీటీడీ పదవి నాకొద్దు – ఎమ్మెల్యే అనిత

1257
mla-anitha-letter-to-cm-naidu-over-ttd-board-member

ఎమ్మెల్యే అనిత ఎంపికపై వివాదం రేగడంతో… చంద్రబాబు అధికారుల నుంచి నివేదిక కోరారు. దీనిపై క్లారిటీ రాకముందే అనిత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాసినట్లు సమాచారం. తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేదన్నారు. తాను హిందువునని… ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామిని ఆమె మరోసారి స్పష్టం చేశారట. వెంకటేశ్వర స్వామిని తాను దర్శించుకున్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారట.

టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను నియమించడంపై పెద్ద వివాదం మొదలయ్యింది. క్రిస్టియన్ అయిన ఆమెను ఎలా నియమిస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె తాను క్రిస్టియన్‌ అంటూ చెప్పిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం… ఆ వీడియోను పరిశీలించింది. ఈ వ్యవహారంపై అధికారులు కూడా నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కాని ఈలోపే అనిత లేఖ రాయడంతో ఈ వివాదానికి ఇంతటితో పుల్‌స్టాప్ పడినట్లేననే ప్రచారం జరుగుతోంది.