ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ మేళా

273
bsnl-special-ipl-plan-offering-153-gb-data

హైదరాబాద్ : బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా మెగా మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెలికాం ఏజీఎం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా మేళాలో వినియోగదారులు ఉచిత 3జీ స్మార్ట్ సిమ్‌లను కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంచైజి, రిటైల్ ఔట్ లెట్, రోడ్ షోలలో పొందవచ్చుని పేర్కొన్నారు. కొత్త కనెక్షన్‌తో 351 ఎంబీ ఉచిత డాటా వినియోగదారులకు అందిస్తున్నట్లు వివరించారు. 10శాతం టాక్ టైం ఆఫర్ టాప్ అప్ రూ.350, రూ.385తో రీచార్జీ చేస్తే పూర్తి టాక్ టైం వస్తుందని తెలిపారు. ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్‌టీహెచ్ కనెక్షన్‌లను బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది నిర్వహించే మేళాలో పోందవచ్చుని తెలిపారు. అదేవిధంగా కనెక్షన్ తీసుకునే వినియోగదారులు పాస్‌ఫోటో, చిరునామా గుర్తింపు, ఆధార్ కార్డుల జీరాక్స్‌లను తప్పనిసరిగా ఇవ్వలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు 1503, 18001801503 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.