
వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం “నాంది”. విజయ్ కనకమేడల “నాంది” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు సతీష్ “నాంది” సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న “నాంది” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి “ఇదే నాంది” అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
చైతన్య ప్రసాద్ ఈ ఎమోషనల్ సాంగ్ కు లిరిక్స్ అందించగా… విజయ్ ప్రకాష్ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన నరేష్ పోస్టర్స్, టీజర్ కొత్తదనంతో సినిమాపై ఆసక్తిని పెంచాయి. చెయ్యని శిక్షకి బలై, ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోయే ఖైదీ సూర్య ప్రకాష్ గా నరేష్ కనిపించాడు.
అతని తరపున వాదించే లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఈ సినిమా విడుదల గురించి నరేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.