రైతు బతికితేనే మనకు బతుకు

212
hero sunil movie jai sena coming soon

స్టార్ కమెడియన్ నుండి హీరొ గా మారి హిట్టు కోసం పరితపిస్తున్న సునీల్ మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అదే టైం లో హీరొ శ్రీకాంత్, సునీల్‌ లీడ్ పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్‌ గౌతమ్‌ హీరోలు గా తెరకెక్కిన చిత్రం ‘జైసేన’. వి. సముద్ర డైరెక్షన్ లో వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్‌కుమార్‌ నిర్మాతలు గా ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది.

సునీల్‌ మాట్లాడుతూ– ‘‘ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ పాత్రలో నటించాను. రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయం’’ అనీ మాట్లాడారు, వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించాం.

రైతుల గురించి తీసిన సినిమా కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ప్రవీణ్, అభిరామ్, రైటర్‌ చందు, కో ప్రొడ్యూసర్స్‌ శిరీషా రెడ్డి, శ్రీనివాస్‌  రెడ్డి పాల్గొన్నారు.

ఇక ఈ సినిమ తో అయిన సునిల్ కి బ్రేక్ రావాలని కోరుకుందాం..