జైసల్మేర్ లో గోపీచంద్ “సీటిమార్” షూటింగ్

225
gopichands seetimaar in jaisalmer

gopichand seetimaar in jaisalmer : సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్”. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం “సీటిమార్” షూటింగ్ రాజస్థాన్ లోని అందమైన ప్రదేశం జైసల్మేర్ లో జరుగుతోంది.

అక్కడి ఎడారిలో గోపిచంద్, తమన్నాతో పాటు సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే సాంగ్స్ కూడా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

తాజాగా “సీటిమార్” దర్శకుడు సంపత్ నంది సెట్స్ నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ “మంచి షాట్ తో మంచి ప్రారంభం” అని కామెంట్ చేశారు.

ఈ వీడియో చూస్తుంటే సినిమాలోని యాక్షన్ సీన్ ఏదో చిత్రీకరిస్తున్నట్టు అన్పిస్తోంది.

Also Read : పవర్ స్టార్ కోసం ఛార్మినార్ సెట్?

ఇంతకుముందు షెడ్యూల్ ను హైదరాబాద్ లో కంప్లీట్ చేశారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

“సీటిమార్”లో గోపీచంద్ కబడ్డీ కోచ్ పాత్రలో, తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో కనిపించనుంది. ఇంతకుముందు “సీటిమార్” చిత్రం నుంచి విడుదలైన తమన్నా, గోపీచంద్ లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. ఏప్రిల్ 2న “సీటిమార్” ప్రేక్షకుల ముందుకు రానుంది.