పవర్ స్టార్ కోసం ఛార్మినార్ సెట్?

251
Charminar Set For Pawan Kalyan's Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా ఛార్మినార్ సెట్ వేయిస్తున్నట్లు టాక్. మొఘలాయిల కాలం నాటి ఇతివృత్తంతో ఈ సినిమాని క్రిష్ రూపొందిస్తున్నాడు.

మొఘలాయిల కాలంలోని వైభవాన్ని తలపించేలా ఈ ఛార్మినార్ సెట్ ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసం క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ సెట్ వేయిస్తున్నట్లు సమాచారం.

ఇక ఇందులో బందిపోటు దొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో ఔరంగజేబు’ పాత్రలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ నటించనున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రానికి “హరహర వీరమల్లు” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో భాగం కానున్నాడు.