నిజామాబాద్ లో ఇద్దరు పోలీసు అధికారులు సస్పెన్షన్!

245
Two police officers suspended in Nizamabad
Reference image

తెలంగాణలో  ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

నిజామాబాద్ రూరల్ ఎస్ ఐ మధుసూదన్ గౌడ్, డిచ్ పల్లి సీఐ వెంకటేశ్వర్లు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు  డీజీపీ మహేందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నాంపల్లి కోర్టులో నిజామాబాద్ రూరల్ ఎస్సై మధుసూదన్ గౌడ్ డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు కోర్టులో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పెండింగ్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించారని నాంపల్లి కోర్ట్ డీజీపీ కి ఎస్ ఐ, సి ఐ లపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసినట్లు తెలిసింది.

అలాగే వీరిద్దరూ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను, కోర్ట్ లో హాజరు కానందున చర్యలు తీసుకోవాలని సూచించడంతో,

డీజీపీ మహేందర్ రెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ గౌడ్ డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.