కరువు కాలంలో ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఓ తీయని కబురు చెప్పింది.
ఆ సంస్థలోని అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 89 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
ఖాళీగా ఉన్న పోస్టులకు నేడు (2021 మార్చి 1) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 31.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆ సంస్థ తెలిపింది.
దరఖాస్తు చేసుకునే ముందు వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఖాళీల వివరాలను ఓసారి చూస్తే.. మొత్తం ఖాళీలు- 89 (జనరల్- 43, ఎస్సీ- 14, ఈడబ్ల్యూఎస్- 9, ఓబీసీ- 7, ఎస్టీ-6) ఉన్నాయి.
అడ్మిట్ కార్డును పరీక్షకు పది రోజుల ముందు ఇస్తారు. రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ మే లేదా జూన్‌లో ఉంటాయి. విద్యార్హతల విషయానికొస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
ఫీజు : రూ.1000. SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌లో పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
ఆన్‌లైన్ టెస్ట్‌లో అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అలాగే SC, ST, OBC, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి.
సదరు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా వెబ్ సైట్‌లోకి వెళ్లి Assistant General Manager పైన క్లిక్ చేయాలి.
అనంతరం Apply Online పైన క్లిక్ చేసి అందులో అడిగిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ వస్తుంది.
రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ అయి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.