కమెడియన్ వైవా హర్ష తాజాగా చేతికి, కాలికి కట్లతో ఆసుపత్రి బెడ్ పై కనిపించాడు.
దీనికి సంబంధించిన పిక్ ను స్వయంగా హర్ష తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పిక్ లో కన్పిస్తున్నట్టుగా హర్షకు ఏం కాలేదు.
ఎందుకంటే అది ఆయన నటిస్తున్న ఓ సినిమాలోది. సుమంత్ హీరోగా నటిస్తోన్న “అనగనగా ఓ రౌడీ” సినిమాలో హర్ష కూడా నటిస్తున్నాడు.
ఇందులో తన పాత్రకు సంబంధించి పిక్ అది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
View this post on Instagram
వైవా హర్ష కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. ఒకవైపు టీవీ షోస్ మరోవైపు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.
యూట్యూబ్ స్టార్, కమెడీయన్, హోస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వైవా హర్ష. ఇటీవల వచ్చిన “కలర్ ఫోటో” చిత్రంలో హర్ష పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
కాగా వైవా హర్ష అక్షర అనే యువతితో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే.