వామ్మో! ఇంధనం ధ‌రలు

191

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకు చుక్క‌లు చూపిస్తున్నాయి. వాటిని అదుపు చేయ‌డం సాధ్యం కాద‌న్న‌ట్టు క‌న‌పిస్తోంది.

వరుస‌గా 11వ రోజు కూడా చ‌మురు కంపెనీలు ఇధ‌నం ధ‌ర‌లు పెంచేశాయి. శుక్ర‌వారం (19-2-2021) లీట‌ర్ పెట్రోల్‌పై 31 పైస‌లు, డీజిల్‌పై 33 పైస‌లు చొప్పున రేట్లు పెంచి సామాన్యుని న‌డ్డి విరిచిన‌ట్ట‌యింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో రికార్డు స్థాయి ధ‌ర న‌మోదైంది. ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర 90.19 పైస‌లు కాగా డీజిల్ ధ‌ర 80.60కు చేరింది.

ఈ రోజు పెరిగిన ధ‌ర‌ల వ‌ల్ల దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇధనం ధ‌ర రూ. 100 ల‌కు చేరుకుంది. గురువారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రూ. 100 లు ఉన్న పెట్రోల్ ధ‌ర శుక్ర‌వారం అది రూ. 100.25పైస‌లు అయింది.

ఇదే రాష్ట్రంలోని అనుప్పూర్‌లో పెట్రోల్ ధ‌ర‌ రూ. 100.57గా డీజిల్ 91.04గా న‌మోద‌య్యాయి. ఇలా ప్ర‌తి రోజూ ఇంధ‌నం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

బండిని బ‌య‌టికి తీయాలంటే ఒక‌టికి 10సార్లు ఆలోచించాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. కొత్త బండి కొన‌టం మాట దేవుడెరుగు ఉన్న బండ్ల‌ను అమ్ముకోవ‌డ‌మే మేల‌ని నిట్టూరుస్తున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందంఇచి ఇంధ‌న ధ‌ర‌ల‌ను అదుపు చేయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటరుకు

ముంబైలో పెట్రోల్ రూ.96.32, డీజిల్ రూ.87.32
చెన్నైలో పెట్రోల్ రూ.92.25, డీజిల్ రూ.85.63
బెంగళూరులో పెట్రోల్ రూ.93.21, డీజిల్ రూ. 85.44
హైదరాబాద్‌ లో పెట్రోల్ రూ.93.78, డీజిల్ రూ.87.91
అమరావతి పెట్రోల్ రూ.96.34, డీజిల్ రూ. 89.94
విజయవాడలో పెట్రోల్ రూ.96.16, డీజిల్ రూ.89.69
విశాఖలో పెట్రోల్ రూ. 95.18, డీజిల్ రూ.88.76