డాక్టర్లకు మెగాస్టార్ అభినందనలు

207
Chiranjeevi visit AIG Hospitals yesterday

మెగాస్టార్ చిరంజీవి డాక్టర్లపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి స్వ‌యంగా వెళ్లిన చిరంజీవి అక్క‌డి వైద్యుల‌ని క‌లిసి వారిని అభినందించారు.

ఈ మేరకు త‌న ట్విట్ట‌ర్‌లో వారితో దిగిన ఫొటోల‌ను కూడా షేర్ చేశారు.

“ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి డాక్టర్లను కలిసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా స‌మ‌యంలో వారు చేసిన సేవ‌లు చాలా గొప్ప‌వి.

క్లిష్ట స‌మ‌యంలో ఆసుపత్రిని ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్లిన పద్మభూషణ్ అవార్డు గ్రహిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్యక ధన్యవాదాలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి వారి సేవ‌లు అందించారు.

కరోనా వంటి క్లిష్ట సమయంలో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిన వైద్యులు ఎంతో మందికి ప్రాణం పోశారు.

ఈ పరిస్థితుల్లో వారు ప్రజలకు చేసిన సేవలని ఎంత ప్రశంసించినా కూడా తక్కువే.