
ప్రస్తుతం ఉన్న ఆధునికయుగంలో మొబైల్ డేటా వాడని వినియోగదారుడు ఉండడు. అలాగే వైఫై, ఇంటర్నెట్ అంటే తెలియనివారు కూడా ఉండరు. వైఫై ఫుల్ ఫాం వైర్‌లెస్ ఫిడెలిటీ (Wireless Fidelity).
ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల కారణంగా మొబైల్ డేటా, వైఫైల వాడకం బాగా పెరిగింది.
వైఫై నిదానంగా ఉన్నప్పుడు దాని స్పీడ్ పెంచుకోవాలంటే ఇలా చేయండి.
రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఈ వైఫై పనిచేస్తుంది.
ఇప్పుడు వైఫై ప్రధానంగా 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగా హెర్ట్జ్ ల్లో పనిచేస్తాయి.
అయితే వైఫైని ఉపయోగించే అన్ని డివైస్‌లూ వీటిని సపోర్ట్ చేయవు.
కొన్ని 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని సపోర్ట్ చేయగా, కొన్ని 5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని సపోర్ట్ చేస్తాయి.
ఈ మధ్య వచ్చే స్మార్ట్ ఫోన్లు, రూటర్లలో ఎక్కువగా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అందిస్తున్నారు.
దీని వల్ల రెండు రకాల ఫ్రీక్వెన్సీని ఇవి అందుకోగలవన్న మాట.
వైఫై నిదానంగా వస్తున్నప్పుడు ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ పెరుగుతుంది.
* ఒకసారి ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి.
* మీకు అవసరం లేకపోయినా వైఫైకి కనెక్ట్ అయి ఉన్న డివైస్‌లను ముందు డిస్ కనెక్ట్ చేయండి.
* రూటర్ యాంటెన్నాలను అడ్జస్ట్ చేసుకోండి.
* రూటర్‌ను ఇంట్లో ఎక్కడ పెట్టారో కూడా చూసుకోండి.
గోడలకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా రూటర్‌ను ఉంచండి.
* మీరు డ్యూయల్ బ్యాండ్ రూటర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి.
రూటర్‌కు దూరంగా ఉంటే 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, దగ్గరగా ఉంటే 5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి.