
కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని, జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సుమారు 500 మందిపై పోలీసు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డొంబివ్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈ నెల 17-18 తేదీల మధ్య డెస్లెపాడాలో పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయని తెలిసింది.
ఈ వేడుకల్లో సామాజిక దూరం, కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం లేదని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో అప్రమత్తమైన బల్దియా అధికారులు వేడుకలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం వేడుకల నిర్వాహకులతో సహా అతిథులందరు సుమారు 500 మందిపై మన్పాడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వారిపై 269, 270, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇక గురువారం మహారాష్ట్రలో 5427 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.