“ఉప్పెన” హీరోయిన్ కు చిరు సర్ప్రైజ్… ఆనందంలో బేబమ్మ

190
Chiranjeevi Calls Krithi Shetty a Born Star

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం “ఉప్పెన”.

ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును కూడా ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, కథ, బుచ్చిబాబు దర్శకత్వం, పాటలు ఈ ‘ఉప్పెన’ సినిమా విజయవంతం కావడానికి కారణమని చెప్పొచ్చు.

భారీ విజయం సాధించిన ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా 70కోట్ల‌కు పైగా గ్రాస్‌ని వ‌సూలు చేసింది. చిత్రబృందంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని అభినందిస్తూ వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు. “ఉప్పెన” మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు చిరంజీవి. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.

ఇక హీరోయిన్ కృతి శెట్టికు కూడా చిరు లేఖ పంపారు. ఆ లేఖ‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందంలో తేలిపోతున్నాను అంటూ సంతోషం వ్య‌క్తం చేసింది కృతి.

లేఖ‌లో “పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహ‌ర‌ణ‌. స్టార్ కావ‌డం కోస‌మే నువ్వు పుట్టావు. భాష తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ , పాత్ర‌లో అద్భుతంగా జీవించావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో” అని చిరు పేర్కొన్నారు.

చిరు లేఖ‌పై కృతి శెట్టి స్పందిస్తూ “చిరు స‌ర్ థ్యాంక్యూ.. మీరు పంపిన గిఫ్ట్‌, మీ మాట‌లు ఎప్ప‌టికీ నా హృద‌యంలో నిలిచిపోతాయి. మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంగా ఉంది” అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చింది.