ఉత్తరాఖండ్‌ వరదలపై సినీ ప్రముఖుల ట్వీట్లు

225
Celebrities Tweets On Uttarakhand Glacier Disaster

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచింది. మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తింది.

దీంతో ఆ నదిపై నిర్మిస్తున్న పవర్‌ ప్రాజెక్టు ధ్వంసం కావడంతో పాటు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు 150 మందికి పైగానే గల్లంతయినట్టు తెలిసింది. ఈ ఘటనపై ప్రముఖ నటీనటులు విచారం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

ఈ దుర్ఘటనపై మహేష్ బాబు స్పందిస్తూ “గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలనిప్రార్థిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఐటీబీపీ జవాన్లకు సెల్యూట్‌ చేశారు మహేష్‌ బాబు.

సోనూ సూద్ “ఉత్తరాఖండ్ మేం మీతోనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

మెహ్రీన్ స్పందిస్తూ ”ఉత్తరాఖండ్ పవిత్ర ప్రాంతంలో వరద పరిస్థితిని చూసి గుండె పగిలిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేసింది.

మాస్ మహారాజ్ రవితేజ ”వరదలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడతారు. సహాయక బృందాలు అందరినీ రక్షిస్తాయని ఆశిస్తున్నా” అని ట్వీట్ చేశారు.