హీరోయిన్ బికినీ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్

252
Ram Gopal Varma Reaction on Apsara Rani Bikini Video

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “థ్రిల్లర్”తో టాలీవుడ్ కు పరిచయమైన బోల్డ్ బ్యూటీ అప్సర రాణి. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటోంది.

తాజాగా అప్సర ఒక హాట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నీలం రంగు బికినీ ధరించి… స్విమ్మింగ్ పూల్‌లో నుంచి వయ్యారంగా నచుకుంటూ వస్తోంది. ‘ఐ యామ్ ఎ వాటర్ బేబీ’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

“వావ్ అప్సర రాణి. అందుకే నిన్ను నేను ఏంజెల్ (అప్సర), క్వీన్ (రాణి) అని పిలుస్తాను. కానీ, ఈ వీడియో ఎవరు తీశారు?” అని అప్సరను ప్రశ్నించారు. దీనికి స్పందించిన అప్సర రాణి.. “మన సూపర్ టాలెంటెడ్ ‘లడికి’ పూజ షూట్ చేసి, ఎడిట్ చేసిన వీడియో ఇది” అని రిప్లై ఇచ్చింది. “ఓహ్ వావ్. లడికి గర్ల్ కేవలం తన్నుతుందని మాత్రమే నేను భావించాను. ఆమె షూటింగ్ కూడా చేస్తుందని నాకు అస్సలు తెలీదు” అని అన్నారు వర్మ.

కాగా అప్సర ఇటీవలే విడుదలైన ‘క్రాక్’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. మరోవైపు పూజ భలేకర్ ‘లడికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.