
నటి, మోడల్, మిస్ ఆసియా బికినీ విజేత గెహన వశిష్ట్‌ను పోర్న్ వీడియో రాకెట్ లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
గెహన పోర్న్ వీడియోల్లో నటించి, వాటిని తన వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
దీంతో గెహనను శనివారం రోజున అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.
గెహన 87 పోర్న్ వీడియోలను షూట్ చేసి వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. వాటిని సబ్‌స్ర్కైబ్ చేసుకునేవాళ్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.
పోర్న్ సినిమాల్లో తమను బలవంతంగా నటింపజేస్తున్నారని ముగ్గురు బాధితులు తమను ఆశ్రయించడంతో ఈ రాకెట్ బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు.
ఈ మేరకు మలాద్‌లోని మధ్ ఐల్యాండ్‌లో ఉన్న గ్రీన్ పార్క్ బంగ్లాలో గురువారం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక బాధితురాలిని రక్షించి రెహబిలిటేషన్ సెంటర్‌కు పంపారు.
మూడు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వసూలైన రూ.36 లక్షలు ఈ బ్యాంక్ అకౌంట్లలో జమ అయినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ పోర్న్ వీడియోలకు యాస్మిన్ దర్శక నిర్మాత, సైఫీ కెమెరామెన్, ప్రతిభ గ్రాఫిక్ డిజైనర్.
దీంతో యాస్మిన్ బేగ్ ఖాన్ అలియాస్ రోవ, ప్రతిభ నలవాడే, భానుసూర్యం ఠాకూర్, మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ సైఫీ, మోను గోపాల్‌దాస్ జోషిలను అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి ఒక హెచ్‌డీ వీడియో కెమెరా, ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, స్పాట్‌లైట్, కెమెరా స్టాండ్, వీడియో క్లిప్స్‌తో కూడిన మెమొరీ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్టు మలాద్ డీసీపీ ప్రకాష్ జాదవ్ చెప్పారు.
ఇక గెహన పలు యాడ్స్, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘ఆపరేషన్ దుర్యోధన’లో గెహన వశిష్ట్ ఐటమ్ సాంగ్ చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరవాత ‘ఆపరేషన్ దుర్యోధన 2’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నమస్తే’, ‘33 ప్రేమకథలు’, ‘బీటెక్ లవ్‌స్టోరీ’ వంటి సినిమాల్లో నటించింది.