అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం

365
bollywood-actor-sridevi-passes-away

తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి శ్రీదేవి (54) శనివారం రాత్రి 11.30ని. లకు దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు చిత్రపరిశ్రమను ఏలిన ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. తమ అతిలోక సుందరి ఇక లేరనే విషయాన్నీ సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేక తీవ్ర విషాదంలో మునిగిపోయారు.



ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ ధ్రువీకరించారు.శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు

1967 లో కందం కరునై అనే చిత్రం ద్వారా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.

13 ఆగష్టు 1963 లో శివకాశి లో జన్మించారు
శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మాయంగార్ అయ్యపన్
తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్.
మొత్తం 260 చిత్రాల్లో నటించారు.
1996 లో బోనికపూర్ తో వివాహం.
2013 లో పద్మశ్రీ అవార్డు లభించింది.


2017లో చివరిగా ‘మామ్‌’ చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్‌ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

1 COMMENT

Comments are closed.