మూడు నిమిషాల్లో ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?

270
redmi-note-5-sold-out-in-three-minutes

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి ఇటీవల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట విడుదల చేసిన ఈ ఫోన్లకు గురువారం(ఫిబ్రవరి 22) ఫ్లిప్ కార్ట్ లో సేల్ నిర్వహించారు. కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు నిమిషాల్లో 3 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని షియోమి అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఫోన్లు లభించని వినియోగదారులు నిరాశకు గురయ్యారు.దీంతో.. వారి కోసం మరోసారి సేల్ నిర్వహించనున్నట్లు షియోమి ప్రకటించింది.



ఫిబ్రవరి 28న రెండో సేల్

ఈ నెల 28వ తేదీన ఈ రెండు ఫోన్లకు మరోసారి సేల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదేవిధంగా ఈ ఫోన్లకు సరకొత్త ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది. ఈ రెండు ఫోన్లలలో ఫేస్ అన్ లాక్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షియోమి అధికారికంగా ప్రకటించింది.