నగరం లో ఈ రోజు (ఫిబ్రవరి 25)

329
todays-programs-hyderabad-february-5

సమావేశం
కార్యక్రమం: తెలంగాణ తహసీల్దార్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వెలుడుతున్న ‘ తెలంగాణ రెవెన్యూ’ మాసపత్రిక, నల్సార్‌ లా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ భూవివాద పరిష్కార వ్యవస్థలు-రెవెన్యూ కోర్టులు’ అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం.
స్థలం: నల్సార్‌ లా యూనివర్సిటీ
సమయం: ఉదయం 9.30గం.



సెమినార్‌
కార్యక్రమం: ‘రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఆయుర్వేద’ అంశంపై నేషనల్‌ సెమినార్‌
ముఖ్యఅతిథి: మంత్రి లక్ష్మారెడ్డి
ప్రారంభం: జస్టిస్‌ టి. అమర్‌నాథ్‌గౌడ్‌
స్థలం: బీఆర్‌కే గవర్నమెంట్‌ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌, ఎర్రగడ్డ, సమయం: ఉదయం 10గం.

ఆత్మీయ సమావేశం
కార్యక్రమం:కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం. సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరావు, రమామెల్కొటే, బెజవాడ విల్సన్‌, భాషాసింగ్‌, సుజాత సూరేపల్లి, శ్రీనివాస్‌ రణబోతు, మల్లికార్జున, యాంకర్‌ ఝాన్సీ, కేఆర్‌ వేణుగోపాల్‌, కిరణ్‌విస్సా, ఆశాలత,జీవన్‌కుమార్‌ పాల్గొంటారు. ఈసందర్భంగా 130 బాధిత కుటుంబాలకు సాయం అందిస్తున్న వారు కూడా పాల్గొంటారు.
స్థలం: తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం
సమయం: మధ్యాహ్నం 1గం.

ముగింపు వేడుకలు
కార్యక్రమం: హైదరాబాద్‌ గోల్ఫ్‌అసోసియేషన్‌,ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌టూర్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న గోల్కొండ మాస్టర్స్‌2018 ముగింపు వేడుకలు
ముఖ్యఅతిథి: శైలేంద్రకుమార్‌ జోషి( సీఎస్‌, తెలంగాణ ప్రభుత్వం)
స్థలం: హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌, సెవన్‌ టూంబ్స్‌ రోడ్‌, గోల్కొండ
సమయం: మధ్యాహ్నం 1.30గం.

సమ్మేళనం
కార్యక్రమం: తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ‘‘అక్షర సైన్యం’’ కవయిత్రుల సమ్మేళనం, ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మలతో పలువులు రచయిత్రులు పాల్గొంటారు.
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: మధ్యాహ్నం 3గం.

పురస్కార ప్రదానం
కార్యక్రమం: మాడభూషి రంగాచార్య స్మారక కథాపురస్కార ప్రదానం
స్వీకర్త:సమ్మెట ఉమాదేవి
సభాధ్యక్షుడు: నాళేశ్వరం శంకరం
స్థలం: ఆంధ్రమహిళాసభ
సమయం: సాయంత్రం 4.30గం.
డి.కామేశ్వరి, సమ్మెట నాగమల్లేశ్వరరావు, అంజలి ఎలమంచి, మాడభూషి లలితాదేవి పాల్గొంటారు.

సంగీత విభావరి
కార్యక్రమం: శ్రీ సాయి లలిత మ్యూజిక్‌ అకాడమీ, అహోబిళం లక్ష్మీనరసింహస్వామి సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘అదే స్వరం- మరోగళం’ సినీ సంగీత విభావరి, కళ్లేపల్లి మోహన్‌కు ఆత్మీయ సత్కారం, బిరుదు ప్రదానం
అతిథులు: డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ వంశీరామరాజు, కళావీఎస్‌ జనార్దనమూర్తి, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, సీహెచ్‌ త్రినాథరావు, అర్చన వెంకటేశ్వరావు
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5గం.

పరిచయ సభ
కార్యక్రమం: ఇండస్‌ మార్టిన్‌ ‘కటికపూలు’ పుస్తకం పరిచయ సభ.
డాక్టర్‌ ఎఫ్‌ గోపీనాథ్‌, కోయి కోటేశ్వరరావు, అసుర, భార్గవ , మానస పాల్గొంటారు.
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సాయంత్రం 6గం.


ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: పెగాసస్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆధ్వర్యంలో ఉర్సులాక్లర్స్‌ చే ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: పెగాసస్‌ ఆర్ట్‌గ్యాలరీ,జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6గం.

మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం,
ఆహ్వాన పత్రికలు పంపాల్సిన చిరునామా: info@teenmaar.news