టిఆర్ఎస్ లీడర్ చిల్లర పని

277
trs-leader-theft-matter-leak-in-social-media

ఆయన పాలమూరు జిల్లాలో ఒక టిఆర్ఎస్ లీడర్. ఆయన చేసిన ఒక చిల్లర పని సిసి టివిలో రికార్డైంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ పనేందంటే?

  • మంచినీళ్ల కోసం వచ్చి చిల్లర పని
  • సిసి టివిలో రికార్డు అయిన లీడర్ బాగోతం
  • సోషల్ మీడియాలో వైరల్


పాలమూరు జిల్లాలోని ఘణపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నేత వేముల కుమార్ గౌడ్ మంచినీటి ప్లాంట్ వద్దకు నీళ్లు నింపుకునేందుకు వచ్చిండు. క్యాండి వాటర్ ప్లాంట్ లో వాటర్ తిసుకోవాడానికి వచ్చిన ఆ లీడర్ అటు ఇటూ చూసిండు. ఎవరూ లేరనుకుని అక్కడే ఉన్న కరెంట్ బల్బ్ ( లైట్ బుగ్గ ) దొంగతనం చేశాడు. ఆ బుగ్గను జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సేఫ్ గా బుగ్గను దొంగిలించానునుకున్నాడు ఆ లీడర్. కానీ అక్కడ సిసి కెమెరాలో ఆయన బాగోతం అంతా రికార్డయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పెద్దరికం చూపాల్సిన అధికార పార్టీ నేతకు ఇదేం చిల్లర బుద్ధి అని జనాలు చర్చించుకుంటున్నారు.