
“బిగ్ బాస్-3″తో మంచి పాపులారిటీ దక్కించుకుంది హిమజ. ఇప్పటికే ఆమెపలు సీరియళ్ళు, సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హిమజ దిగిన సెల్ఫీ వైరల్ అవుతోంది.
అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఏకంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ హిమజను వరించింది.
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ భారీ బడ్జెట్ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది.
ఈ సందర్భంగా పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హిమజ.. “ఓ మై గాడ్.. ఈ రోజు నా కల నెరవేరింది.
పవన్ కళ్యాణ్ గారిని ‘తొలి ప్రేమ’ సినిమాలో చూసినప్పుడు ఆయణ్ని కనీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా..
కానీ, ఇప్పుడు ఏకంగా ఆయన సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇంత మంచి చాన్స్ ఇచ్చిన దర్శకుడు క్రిష్‌గారికి కృతజ్ఞతలు.
పవన్ సర్.. మీతో కలిసి నటించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా” అంటూ తన ఆనందాన్ని తెలిపింది.
మొత్తానికి పవన్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో హిమజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
View this post on Instagram