తలనొప్పిగా ఉందా… ఈ టిప్స్ పాటించండి…!

234
Simple Tricks for Fast Relief from Headache

సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరికీ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆహార అలవాట్లు, అనారోగ్య కారణాలు వంటివి ఎక్కువ మందిలో వచ్చే తల నొప్పికి కారణాలు.

మైగ్రేన్, హై టెన్షన్, పని ఒత్తిడి, నిద్ర లేమి వంటివి కూడా తల నొప్పులకు కారణాలవుతాయి.

సైనస్, మైగ్రేన్ వంటి తల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే వీటికి వైద్యులను సంప్రదించాల్సిందే.

తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉంటే అది ‘మైగ్రేన్’. ఎక్కువ ఎండలో నిల్చున్నా లేదా పెద్ద శబ్దం విన్నా ఈ తరహా తల నొప్పి ఎక్కువ అవుతుంది.

తల లోపల ఎక్కువ ఒత్తిడి అనిపించినా, తల చుట్టూ ఏదో రబ్బర్ బ్యాండ్ చుట్టేసినట్టుగా అనిపించినా అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్టే. సహజంగా ఇది ప్రమాదకరమైన తల నొప్పి కాదు.

నుదిటి వెనుకన, కళ్ల మధ్య, కంటి దిగువున, తల వెనుక నొప్పి వస్తే అది సైనస్ తల నొప్పి. సాధారణంగా సైనస్ తల నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి.

తల నొప్పితోపాటు కళ్లు ఎర్రబడడం, కళ్లు వాయడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటివి జరిగితే అది ‘క్లస్టర్ తల నొప్పి’.

కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ తీసుకున్నా లేదా కొన్ని రకాల వాసనలు పీల్చినా తల నొప్పి వస్తే అది ‘అలెర్జీ తల నొప్పి’.

తలనొప్పి తగ్గాలంటే ఇలా చేయండి :

కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి.

గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ అల్లం జ్యూస్ మిక్స్ చేసి తాగితే తల నొప్పి మటుమాయం అవుతుంది.

గోరు వెచ్చని పాలలో అర చెంచా పసుపు కలుపుకుని తాగితే తల నొప్పి తగ్గుతుంది.

మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది.

వర్క్ ఎక్కువైనప్పుడు తల నొప్పి వస్తే రెండు చెర్రీస్‌ని నమిలితే మంచి రిజల్ట్ ఉంటుంది.

కొన్ని సార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

వీలైనంతగా మసాలా ఫుడ్ తగ్గించాలి. విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
వెల్లుల్లి మిశ్రమంలో రెండు బొట్లు నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, స్పినాక్ వంటివి తల నొప్పిని నివారిస్తాయి.

ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్ పెట్టుకుంటే మంచిది.

తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ.

కంప్యూటర్‌ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో వర్క్‌కి విరామం ఇవ్వాలి.