బెల్లంకొండ శ్రీనివాస్‌ కవచం టీజర్‌

548
bellamkonda srinivas kavacham movie teaser released

‘అనగనగనగా ఓ రాజ్యం … ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’… అని విలన్‌ వాయిస్‌లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా… వాడే పోలీస్‌… అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్‌.




 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’ . ఈ సినిమాతో శ్రీనివాస మామిళ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ శొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడురా.. వాడే పోలీస్‌’ , ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్‌ కంటే బ్రెయిన్‌ ఫాస్ట్‌గా ఉండాలి’ అంటూ శ్రీనివాస్‌ చెప్పిన డైలాగ్స్‌ వింటుంటే కవచం ఫుల్‌ టూ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 

కాగా వరుసగా మాస్‌ ఎంటర్‌టెయిన్‌లతో అలరిస్తున్న శ్రీనివాస్‌ ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.