బాలయ్య, బోయపాటి సినిమాకు టైటిల్ ఖరారు

236
Balakrishna and Boyapati Movie BB3 Title Fix

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ పలు వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఎట్టకేలకు సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు “గాడ్‌ ఫాదర్” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్‌కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే టైటిల్ పై అధికారిక ప్రకటన రానుంది.

“బీబీ3” వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే “ఫస్ట్ రోర్” అనే వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ఆ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్, ఆయన లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీయార్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పుడు మూడవసారి వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ అవుతుంది.