దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ లో మహేష్…!

318
Mahesh Babu visits Dubai's Smart Police Station

ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

షార్జాలో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, కీర్తి సురేష్‌ల‌పై సాంగ్స్‌తో పాటు కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు టాక్.

అయితే కొద్ది రోజులుగా దుబాయ్‌లోని ప‌లు ప్రాంతాల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ వ‌స్తున్న మ‌హేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేష‌న్‌ను చూపించారు.

గురువారం లా మెర్‌లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (ఎస్పీఎస్) ను సందర్శించారు మ‌హేష్ బాబు. లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్.

అక్కడి టెక్నాలజీకి ఫిదా అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘గల్ఫ్ టుడే’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఈ స్మార్ట్ పోలీస్ స్టేషన్ మ‌నుషుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌ల‌ను అందిస్తుంటుంది.