తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్ట్ న్యాయవాది వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు.
ఇక ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బిట్టు శ్రీను కూడా పట్టుబడటంతో నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
హత్య చేసేందుకు వాహనాన్ని, ఆయుధాలను సమకూర్చినట్టు బిట్టు శ్రీను మీద అభియోగాలు ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీను అరెస్ట్ సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులను మంథని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.