బతుకు బండీని లాగాలి అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుని తీరాలి. చదువురాని వాళ్లు కూలీ పనులకు వెళతారు.
చదువుకున్న వాళ్లు తమ అర్హతకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ల సంతోషానికి అవధులుండవు.
గతేడాది కరోనా కొట్టిన దెబ్బకు చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. ఈ తరుణంలో నిరుద్యోగులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించంది.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదుల చేసింది. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను అప్రెంటిస్ పోస్టుల ద్వారా భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
పదో తరగతి పాసైన వారు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి రాత పరీక్షా ఉండదు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ మార్చి 5. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వారి మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్‌పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఉన్న ఖాళీలు: 2532
వీటిల్లో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్-469, ముంబై కల్యాన్ డీజిల్ షెడ్-53, కుర్లా డీజిల్ షెడ్-60, సీనియర్ డీ (టీఆర్‌ఎస్) కుర్లా, కల్యాణ్-371, పారెల్ వర్క్‌షాప్-418, మాతుంగా వర్క్‌షాప్-547, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా-60, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్-80, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్-118, మన్మాడ్ వర్క్‌షాప్-51, టీఎండబ్ల్యూ నాసిక్‌రోడ్-49, డీజిల్ లోకోషెడ్ (పుణె)-49, ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పూర్)-48, అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-66, కుర్దువాడి వర్క్‌షాప్ (షోలాపూర్)-21 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
పదవ తరగతి. లేదంటే దీనికి సమానమైన కోర్సులో 50 శాతం మార్కరులతో పరీక్ష పాస్ అయి ఉండాలి. దీనితో పాటు ఎన్‌టీవీసీ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఐటిఐ కోర్సు చేసి ఉండాలి
వయసు: 15 నుంచి 24 ఏళ్ల లోపు మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
https://www.rrccr.com/Tradeapp/Login
దరఖాస్తులు ప్రారంభం: 6 ఫిబ్రవరి 2021 .. చివరితేదీ: 5 మార్చి 2021