అల్లరి నరేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రం “నాంది” గత శుక్రవారం విడుదలైంది. ఈ వైవిధ్యమైన చిత్రం హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.
అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమాగా ‘నాంది’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
విడుదల ముందు వచ్చిన అప్‌డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. దాదాపు ఎనిమిదేళ్ల అల్లరి నరేష్ ఈ చిత్రంతో హిట్ అందుకున్నారు.
తొలి రెండు రోజులతో పోల్చితే మూడో రోజు కలెక్షన్స్ నిర్మాతలను ఆనంద పెట్టాయి.
మూడోరోజు ఏరియావైజ్…
నైజాం- 47 లక్షలు
సీడెడ్- 15 లక్షలు
ఉత్తరాంధ్ర- 6.2 లక్షలు
ఈస్ట్ గోదావరి- 8.2 లక్షలు
వెస్ట్ గోదావరి- 5.5 లక్షలు
గుంటూరు- 8.4 లక్షలు
కృష్ణా- 9 లక్షలు
నెల్లూరు- 4.8 లక్షలు వసూలయ్యాయి.
మూడో రోజుకు గాను 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటాడు అల్లరి నరేష్.
ఇక మొత్తంగా మూడు రోజుల కలెక్షన్స్ :
నైజాం- 93 లక్షలు
సీడెడ్- 29 లక్షలు
ఉత్తరాంధ్ర- 19 లక్షలు
ఈస్ట్ గోదావరి- 16 లక్షలు
వెస్ట్ గోదావరి- 12 లక్షలు
గుంటూరు- 17 లక్షలు
కృష్ణా- 18 లక్షలు
నెల్లూరు- 10 లక్షలు వసూలయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూలైంది.
త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే అవకాశం ఉంది.