
బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీలను అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు.తెలంగాణ బీజేపీ నేతలపై ఆర్టిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు ఉంది కదా అని బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ నేతలకు చేతనైతే ఢిల్లీలో కేంద్రం పెద్దలను నిలదీయాలని సూచించారు.
బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా? అని నిలదీశారు.
ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వనటి పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయో ఆ పార్టీ నాయకులు చెప్పాలని దుయ్యబట్టారు.