మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

184

మండల పరిషత్‌ మాజీ అధ్యక్షురాలి భర్తను గ్రామ సర్పంచ్‌ దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

మాజీ ఎంపీపీ భర్తను గ్రామ సర్పంచ్‌ దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ మండలం హన్మపూర్‌లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది.

పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది.

ఈ నేపథ్యంలో సోమవారం సర్పంచ్‌ కుటుంబ సభ్యులు వీరప్పపై దాడి చేశారు. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.