దేవిశ్రీ ప్రసాద్ కు మెగాస్టార్ సర్ప్రైజ్

260
Chiranjeevi surprise gift to Devi Sri Prasad

మెగాస్టార్ చిరంజీవి “ఉప్పెన” చిత్రబృందాన్ని అభినందిస్తూ వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు.

“ఉప్పెన” మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు చిరంజీవి. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.

దేవీ శ్రీ ప్రసాద్ ఓ వీడియో ద్వారా ఆయన పంపిన లెటర్ చదివి వినిపిస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశారు.

”డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ ‘ఉప్పెన’ విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు.

స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో.. చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు.

నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమతో చిరంజీవి” అంటూ చిరు ఆ లేఖలో పేర్కొన్నారు.

మెగాస్టార్ పంపిన ఈ లెటర్, మెగా బహుమతి పట్ల దేవీ శ్రీ ఆనందం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘లవ్ యూ చిరు సార్’ అని పేర్కొన్నారు దేవీ శ్రీ ప్రసాద్.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం “ఉప్పెన”. ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, కథ, బుచ్చిబాబు దర్శకత్వం, పాటలు ఈ ‘ఉప్పెన’ సినిమా విజయవంతం కావడానికి కారణమని చెప్పొచ్చు.

ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్న ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం గమనార్హం.