నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.
ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్.బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
కాగా నాని బర్త్ డే సందర్భంగా “శ్యామ్ సింగరాయ్” చిత్రం నుండి ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేశారు. ఇందులో పాతకాలం నాటి తలకట్టుతో కనిపించగా, ఆయనని వెనుక నుండి ఓ స్త్రీ హగ్ చేసుకొని ఉంది.
పోస్టర్ విడుదలైనప్పటి నుండి ఆమె ఎవరనే ఆసక్తి మొదలైంది అందరిలో.
అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు సాయి పల్లవి అని తెలుస్తుంది. కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో కథ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని తెలిసింది.
ఇక నాని ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన టక్ జగదీష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి అనే చిత్రాలు చేస్తున్నారు.