మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు క్లారిటీ!

148
AP High Court clarity municipal elections

పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా మార్చి 10వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.

అధికార పక్ష నేతలు గతంలో తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని జనసేన పార్టీతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం  తెలిసిందే.

పాత నోటిఫికేషన్ వచ్చి 11 నెలలు అయిందని, తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు.

అయితే పిటిషనర్ల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది.  దీంతో  రాష్ట్రంలో పురపాలక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది.