పవన్, క్రిష్ చిత్రం… లుక్ లీక్

230
Pspk 27 pics leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ప‌వ‌న్ వీర‌మ‌ల్లుగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడ‌ని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారం న‌డుస్తుంది.

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కథతో క్రిష్‌ మ్యాజిక్‌ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎమ్‌. ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా కోసం 170 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు స‌మాచారం.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ లుక్ లీక్ అయ్యింది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ఆ లోపే లీక్ రాయుళ్ళు ప‌వ‌న్ ఫొటోని లీక్ చేశారు.

ఇందులో ప‌వ‌న్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.