ప్రభుత్వ ఉద్యోగం చేయానుకునే వారికి ఇది మంచి అవకాశం. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు వివరణాత్మకమైన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవీ విడుదల చేసింది.
మొత్తం 1159 ఖాళీలను ప్రకటించింది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22న మొదలైంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది.
అప్లై చేసేముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అప్లై చేయడానికి 2021 మార్చి 7 చివరి తేదీ.
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్- INCET ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు 1159 ఖాళీలు ఉండగా అందులో హెడ్‌క్వార్టర్స్ ఈస్ట్రన్ నావల్ కమాండ్ విశాఖపట్నం- 710, హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నావల్ కమాండ్ ముంబై- 324, హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్ కొచ్చి- 125 పోస్టులున్నాయి.
ఆన్‌లైన్ కంప్యూటర్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.
విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాసై ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ.205. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
అభ్యర్థులు ముందుగా https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో Join Navyపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Ways to joinపై క్లిక్ చేసి Civilians పై క్లిక్ చేయాలి.