
బిగ్‌బాస్ సీజన్ 4లో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది గంగవ్వ. ఉన్నది కొద్ది రోజులే అయినా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
బిగ్‌బాస్‌కు రాకముందు మై విలేజ్ షోతో గంగవ్వ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు వచ్చి మరింత పేరు సంపాదించుకుంది.
60 ఏళ్ళ వయసులో అతి సామాన్యురాలిగా బిగ్ బాస్ గేమ్ షోకి వచ్చి అదరగొట్టింది గంగవ్వ. ఈ వయసులో ఇలాంటి కంటెస్టెంట్‌ను ఎంపిక చేసినా.. అక్కడి వాతావరణానికి ఆమె అలవాటు పడుతుందా అని అందురూ అనుకున్నారు.
బిగ్‌బాస్ ఇచ్చే ఫిజికల్ టాస్కులు ఎలా చేస్తుంది అంటూ చాలా మంది పెదవి విరిచారు. కానీ బిగ్ బాస్ తాను అనుకున్నది చేశాడు.
గంగవ్వ కూడా ఓ మంచి కారణంతోనే హౌస్‌కు వచ్చింది. తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా టైటిల్ గెలిచి తీరతానని చెప్పింది.
కానీ మధ్యలో అనారోగ్యం కారణంగా బయటికి వచ్చేసింది. కానీ ఉన్నన్ని రోజులు బాగానే అలరించింది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్‌కు ఈమె వెళ్లడానికి కారణం సొంతింటి కల. కానీ టైటిల్ గెలవకపోవక పోతే అంత డబ్బు రాదు.
ఆమె బాధను అర్థం చేసుకున్న నాగార్జున, బిగ్ బాస్ టీమ్ అంతా కలిసి ఇప్పుడు గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్నారు. ఇప్పటికే సొంతూళ్లో స్థలం ఉండటంతో అక్కడే ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతుంది.
ఈ మేరకు నాగార్జున నుంచి గంగవ్వకు రూ 7 లక్షల చెక్ వచ్చింది. అలాగే బిగ్ బాస్ టీమ్ నుంచి కూడా రూ. 10 లక్షలు అందాయి.
దాంతో పాటు అవ్వ దగ్గర ఉన్న డబ్బులతో కలిపి మొత్తం రూ. 20 లక్షలతో సొంతూళ్లో ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ.
ఇప్పటికే ఇల్లు నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. సొంతింటి కల నెరవేర్చుకుంటున్న ఈ తరుణంలో అవ్వ హాస్పిటల్ చుట్టూ తిరుగుతోంది.
దానికి కారణం ఆమెను చాలా రోజులుగా మోకాళ్ల నొప్పులు వేధిస్తుండటమే. వయసు రీత్యా వచ్చే నొప్పులే ఇవి.
కానీ 60 ఏళ్లు దాటిన అవ్వకు మోకాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది. ఈమె కాళ్లను వైద్యులు పరీక్షిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
కాళ్ల నొప్పులు మినహాయిస్తే తనకు ఏ అనారోగ్యం లేదని అభిమానులకు తెలిపింది గంగవ్వ. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన సొంత యూ ట్యూబ్ ఛానెల్‌లో వరస వీడియోలు పెడుతుంది గంగవ్వ.