సీఎం కేసీఆర్ బర్త్ డే… సినీ ప్రముఖుల విషెస్

306
Movie Celebrities says birthday wishes to CM KCR

నేడు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ ‌బాబు తదితరులు… సీఎం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

“మీ నాయ‌క‌త్వంలో రాష్ట్రం పురోగ‌తి సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

“పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఎంపి సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం శ్రీ కేసీఆర్ గారికి ఇచ్చే కానుక.

అందరం మొక్కలు నాటుదాం… వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం” అని చిరంజీవి ట్వీట్ చేసారు.