షర్మిల పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ లు!

282
I do not like party Jagan: Sharmila

తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

జిల్లాల వారీగా నేతలతో ఆమె సమావేశాలను నిర్వహిస్తున్నారు. పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు.

వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు.

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరనున్నారు. ఈ రోజు షర్మిలతో ఆయన భేటీ కానున్నారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి మద్దతు పలికారు.

తెలంగాణలో ఆంధ్రవాళ్ల పార్టీలు ఎందుకని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.