A1 ఎక్స్‌ప్రెస్ : “అమిగో” లిరిక‌ల్ వీడియో సాంగ్

652
Amigo Lyrical Video Song

Amigo Lyrical Video Song : పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై….

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం “A1 ఎక్స్‌ప్రెస్”.

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు మంచి స్పందన లభించింది. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : “శ్రీకారం” ట్రైలర్ విడుదల

తాజాగా ఈ చిత్రం నుంచి “అమిగో” లిరిక‌ల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. హిప్‌హాప్ త‌మిళ మ్యూజిక్ అందించిన ఈ పెప్పీ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ఇన్నో గెంగా ఆల‌పించారు. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.