మహిళపై కానిస్టేబుల్‌ వేధింపులు!

140
Sexual assault Inter‌ student

తనతో సంబంధం పెట్టుకోవాలని మహిళను కానిస్టేబుల్‌ వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే హైద్రాబాద్ శివారులోని రెడ్డిబస్తీలో గిరిజన మహిళ మూడేళ్ల క్రితం నుంచికుటుంబంతో కలిసి నివాసముంటుంది.

వారి పక్కింట్లో మాదన్నపేటలో కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు కుటుంబం నివసించేది. ఇద్దరి కుటుంబ సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. ఇదే అవకాశంగా భావించి కానిస్టేబుల్‌ ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో బాధితురాలిని వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు.ఈ క్రమంలో ఆమెను అసభ్యంగా దూషించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న అతను తిరిగి వేధింపులు మొదలు పెట్టాడు. గతనెల 25న బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు బాధితురాలు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసుల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.