“నార్సిసిస్ట్స్” అంటూ రిచా చద్దా పోస్ట్… కంగనాను ఉద్దేశించేనా ?

187
Richa Chadha shares narcissism checklist after Kangana Ranaut compares herself to Meryl Streep

బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా పరోక్షంగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను టార్గెట్ చేసింది. తాజాగా రిచా “నార్సిసిస్ట్స్” లక్షణాలు అంటూ ఓ ఫోటో షేర్ చేసింది.

“నార్సిసిస్ట్స్”’ అంటే ఇంగ్లీషులో అహంభావి అని అర్థం.అయితే రిచా ఎక్కడా కంగనా పేరును ప్రస్తావించలేదు.

కానీ నెటిజన్స్ అయితే రిచా టార్గెట్ కంగనానే అని డిసైడ్ అయిపోయారు.

ఎందుకంటే “నేను మెరైల్ స్ట్రీప్ కంటే గ్రేట్” అని కంగనా అన్న కాసేపటికే రిచా ఈ పోస్ట్ చేసింది.

అయితే కంగనా పోస్ట్ ఏంటంటే… ఇద్దరు ప్రముఖ అంతర్జాతీయ నటీమణులతో ఆమెను పోల్చుకున్నారు కంగనా. “ఒక నటిగా నేను చూపించే ఈ స్థాయిని ప్రస్తుతం ఈ భూగోళంలో మరే నటి చూపించలేదు.

మెరిల్ స్ట్రీప్ (ప్రముఖ హాలీవుడ్ నటి) మాదిరిగా వైవిధ్యమైన పాత్రలు చేసే రా టాలెంట్ నాలో ఉంది.

అలాగే, గాల్ గాడోట్ (ప్రముఖ ఇజ్రాయిల్ నటి) మాదిరిగా యాక్షన్ చేయగలను, గ్లామర్‌గా కనిపించగలను.

నా కన్న గొప్పగా, అద్భుతంగా నటించే నటి ఈ భూమి మీద ఉందని నాకు చూపిస్తే నేను డిబేట్‌కు సిద్ధం. ఒక వేళ మీరు నిరూపిస్తే నేను నా అహంకారాన్ని వదులు కుంటున్నానని మాటిస్తున్నాను.

అప్పటి వరకు ‘తలైవి’, ‘ధాకడ్’ గర్వాన్ని మీకు అందించగలను” అని కంగనా మరో ట్వీట్ చేశారు.” అని కంగనా చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.