విజయ్ దేవరకొండ “లైగర్” అప్డేట్

262
Liger's release date to be out tomorrow

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “లైగ‌ర్”.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే ‘లైగ‌ర్’ సినిమా అప్డేట్ ఇచ్చారు.

రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను చిన్న వీడియో ట్రాక్ తో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న “లైగర్” తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్రబృందం విడుద‌ల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.