ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. వారికి మాత్రమే వర్తింపు!

127
SBI bumper offer.. only applicable to them!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే వారికి ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేసింది.

ఏడాదికి క‌నిష్ఠంగా 6.8 శాతం వ‌డ్డీతో హోంలోన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ వివిధ హోంలోన్ల‌ను అందిస్తోంది.

అందులో సాధార‌ణ హోంలోన్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోంలోన్‌ సదుపాయం కల్పించింది.

ఆర్మీ, ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోంలోన్‌ల‌తోపాటు ఎస్‌బీఐ స్మార్ట్‌హోమ్‌, ఎస్‌బీఐ ఎన్నారై హోంలోన్‌లాంటివి అందిస్తోంది.

అతి త‌క్కువ వ‌డ్డీరేట్ల‌తో ఇప్ప‌టికే దేశంలో హోంలోన్ షేర్‌లో 34 శాతం వాటా ఎస్‌బీఐ కలిగి ఉంది.

స‌గ‌టున రోజుకు వెయ్యి మంది హోంలోన్ కోసం దరఖాస్తు చేసుకొంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.