కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “మెరిసే మెరిసే”. పవన్ కుమార్ కు ఇదే తొలి చిత్రం. శ్వేతా అవస్తి హీరోయిన్‌గా, వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నారు.
తాజాగా “మెరిసే మెరిసే” చిత్రం టీజర్ ను ప్రముఖ యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ సినిమా అందరినీ ఆకట్టుకోవాలని ఆశించారు. ఈ టీజర్ 1 నిమిషం 7 సెకనుల నిడివితో ఉంది. అయితే ఇందులో యూత్ ను ఆకట్టుకునే సన్నివేయాలే ఎక్కువగా ఉన్నాయి.
టీజర్ లో “గెలుపు, ఓటములు పక్కపక్కనే ఉంటాయి.. కానీ ఎప్పటికీ కలవవు.. వీళ్ళిద్దరిలా” అనే డైలాగ్ బాగుంది. లవ్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు కలిగిన ఈ టీజర్ చక్కటి విజువల్స్‌తో యూత్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మీరు కూడా “మెరిసే మెరిసే” టీజర్ ను వీక్షించండి.