పవన్, క్రిష్ చిత్రం టైటిల్ ఇదే ?

170
Pawan Kalyan and Krish film titled Veeramallu?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం టైటిల్ విషయంలో ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో విరూపాక్ష, హరహర మహాదేవ్ వంటి టైటిల్స్ ఎక్కువగా విన్పించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “వీరమల్లు” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక ఈ చిత్రంలో ఔరంగజేబు’ పాత్రలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ నటించనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే “వకీల్ సాబ్” షూటింగ్ ను పూర్తి చేసిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర రీమేక్, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా‌తో పాటు మరో రెండు చిత్రాలకు సైన్ చేసి ఉన్నారు.